సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఉంది.
సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





