April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Gurukul School: గురుకులంలో విషాదం.. బాలిక మృతి!


తెలంగాణలోని కుమ్రంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి(12) మృతి చెందింది. ఇటీవలే జ్వరం,కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరి డిశ్చార్జ్ అయింది. మళ్లీ కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని మృతి చెందింది.



తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జైనూర్ మండలం గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి (12) కడుపునొప్పితో మృతి చెందింది. జాడుగూడకు చెందిన విద్యార్థిని పార్వతి సాసిమెట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది.

కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని మృతి
అయితే కొద్ది రోజుల క్రితం బాలిక పార్వతి తన ఇంటికి వచ్చింది. ఆపై జ్వరం, కడుపునొప్పితో  ఉట్నూర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరింది. ఇక అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న ఆ బాలిక.. మూడు వారాల క్రితం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని పార్వతి మృతి చెందింది.

Also Read

Related posts

Share via