తెనాలి శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకొంది.
గుంటూరు : తెనాలి శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకొంది. తెనాలి రూరల్ సీఐ బి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్రిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు యువకుడి గొంతు కోసి హత్య చేశారు. ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బుర్రిపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావు(34)గా గుర్తించారు. మంగళవారం ఉదయం వ్యక్తిగత పనులమీద తెనాలికి వెళ్లిన కోటేశ్వరరావు.. తిరిగి ఇంటికి రాలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కోటేశ్వరరావు గతంలో పలువురి సెలబ్రిటీల వద్ద బౌన్సార్గా పనిచేసినట్లు చెప్పారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సిఉంది.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025