SGSTV NEWS online
Andhra PradeshCrime

గుంటూరు: పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సై, కానిస్టేబుళ్లు!



జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులే వాటికి కేంద్రబిందువుగా మారిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా పరిధిలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది జూదం ఆడుతూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ () దాడుల్లో పట్టుబడ్డారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులే వాటికి కేంద్రబిందువుగా మారిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా పరిధిలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది జూదం ఆడుతూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్సై కొమ్మూరి వెంకట్రావు స్వయంగా జూదం నిర్వాహకుడిగా మారడం గమనార్హం.

ఓ హోటల్‌లో రహస్యంగా

గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి పక్కన, తక్కెళ్లపాడు సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో రహస్యంగా ఈ జూదం స్థావరం నడుపుతున్నట్లుగా నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం, సుమారు వారం రోజుల కిందట ఈ హోటల్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. జూదం ఆడుతున్న వారిలో ఏఎస్సై కొమ్మూరి వెంకట్రావుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ సంఘటన జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Also read

Related posts