SGSTV NEWS
Andhra PradeshCrime

Guntakal: పాత ఇంటి గోడ.. మృత్యువై కాటేసింది!…రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి మృతి


గుంతకల్లు పట్టణం, గుంతకల్లు, : పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తుండగా.. దాని గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని బలిగొన్న విషాద ఘటన ఇది. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం జరిగిన ఈ ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుల కథనం.. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వెనుక రమేశ్ అనే వ్యక్తి ఓ పాత ఇంటిని కొనుగోలు చేశారు. రెండు రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఏకలవ్యనగర్లో కిరాణా దుకాణం నడిపే వెంకటరాముడు (57) సరకుల నిమిత్తం శనివారం బైక్పై మార్కెట్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా పనులు జరుగుతున్న ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా గోడ కుప్పకూలి ఆయనపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వెంకటరాముడు అక్కడికక్కడే మరణించారు  భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య ఉమాదేవి అక్కడికి చేరుకున్నారు. మట్టి పెల్లల కింద విగతజీవిలా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా  రోదించారు. జనసంచారం ఉన్నచోట ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేకుండా పనులు ఎలా చేపడతారని స్థానికులు ప్రశ్నించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts