November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

లయోలా కాలేజ్ యాజమాన్యం వేధింపులు తాకలేక గుంజా లక్ష్మీ(33) హిట్ స్ప్రే తాగి ఆత్మహత్య.

లయోలా కాలేజ్ యాజమాన్యం వేధింపులు తాకలేక గుంజా లక్ష్మీ(33) హిట్ స్ప్రే తాగి ఆత్మహత్య.

కృష్ణాజిల్లా …

పెనమలూరు నియోజకవర్గం …

*లయోలా కాలేజీ యాజమాన్యం వేధింపు తాళ్ల లేక ఉయ్యూరు కి చెందిన లక్ష్మి అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.

ఉయ్యూరు పశువుల ఆస్పటల్ బజార్లో నివాసముంటున్న చైతన్య గుంజాలక్ష్మీలు విజయవాడ లయోలా కాలేజీలో పనిచేస్తుంటారు. చైతన్య కాలేజీలో ఎలక్ట్రిషన్ గా గుంజా లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటుంది.
లక్ష్మి గత కొంత కాలం క్రితం విద్యార్థుల దగ్గర తన అవసరాల నిమిత్తం కొంత మొత్తం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ అకౌంటెంట్ విజయలక్ష్మి సింహాచలంలో తనను విద్యార్థుల ముందు అనేకమార్లు అవమానించటమే కాకుండా తనను నిత్యం ఇదే విషయంపై వేధిస్తున్నారని మనస్థాపం చెంది శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. యధావిధిగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి బయలుదేరుతుండగా ఇంట్లో కర్చీఫ్ మర్చిపోయాను అంటూ వెనక్కి వెళ్లిన లక్ష్మి ఇంట్లో ఉన్న హిట్స్ సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆమెకు వాంతులు అవుతుండగా భర్త మరియు ఇంటి యజమాని కలసి హాస్పిటల్కు తరలించగా వైద్య సేవలు అందిస్తూ ఉండగానే లక్ష్మి మరణించింది.
ఆమె హ్యాండ్ బ్యాగ్లు పరిశీలించగా అందులో సూసైడ్ నోటు ఉండడాన్ని గమనించిన భర్త పోలీసులకు అందజేశారు.
ఆ సూసైడ్ నోట్లో తాను విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని అవి తిరిగి ఇస్తానని ఫాదర్ కిషోర్ కి చెప్పామని ఆయన కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. తన చావుకి అకౌంటెంట్ విజయలక్ష్మి సింహాచలం మరియు డిగ్రీ ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్లే కారణమని పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉయ్యూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via