April 15, 2025
SGSTV NEWS
CrimeTelangana

Guise Of Sorcery : చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తి దారుణ హత్య!

భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కుంజా బిక్షం అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కుంజా ప్రవీణ్, మల్కం గంగయ్య హత్య చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతుంటే.. కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇద్దరు మూర్ఖులు. ఈ ఘటన భద్రాధ్రికొత్తగూడెం జిల్లా  జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయగూడెంలో చోటుచేసుకుంది.

కుంజా బిక్షం హత్య
కోయగూడెం గ్రామంలో  కుంజా బిక్షం (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే గత రాత్రి కుంజా బిక్షం అనుమానాస్పదంగా మృతి చెందాడు.  గ్రామసమీపంలోని స్థానిక వాగులో మృతదేహమై కనిపించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా… మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రాళ్లతో ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసి..  అతను మృతి చెందిన తర్వాత శవాన్ని వాగులో పడేసినట్లు పోలీసులు అంచనా వేశారు.

Guise Of Sorcery : చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తి దారుణ హత్య!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కుంజా బిక్షం అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కుంజా ప్రవీణ్, మల్కం గంగయ్య హత్య చేసినట్లు తెలుస్తోంది.

author-image
By Archana  21 Oct 2024
in ఖమ్మం
క్రైం
black magic
Bhadradrikottagudem District sorcery Incident

షేర్ చేయండి
Bhadradrikottagudem District :  ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతుంటే.. కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇద్దరు మూర్ఖులు. ఈ ఘటన భద్రాధ్రికొత్తగూడెం జిల్లా  జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయగూడెంలో చోటుచేసుకుంది.

Also Read:  Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామ‌స్ థ్రిల్లర్ ‘భార్గ‌వి నిల‌యం’ – Rtvlive.com

కుంజా బిక్షం హత్య
కోయగూడెం గ్రామంలో  కుంజా బిక్షం (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే గత రాత్రి కుంజా బిక్షం అనుమానాస్పదంగా మృతి చెందాడు.  గ్రామసమీపంలోని స్థానిక వాగులో మృతదేహమై కనిపించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా… మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రాళ్లతో ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసి..  అతను మృతి చెందిన తర్వాత శవాన్ని వాగులో పడేసినట్లు పోలీసులు అంచనా వేశారు.

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య
అయితే గత రాత్రి అదే గ్రామానికి చెందిన కుంజా ప్రవీణ్, మల్కం గంగయ్య..  కుంజా బిక్షంను మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. అప్పటికే  కుంజాబిక్షం  తమ కుటుంబం పై చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతని పై కక్ష పెట్టుకున్న ప్రవీణ్, గంగయ్యలే  అతన్ని హత్యచేసి ఉంటారని గ్రామస్థులు చెప్పారు. మరో వైపు కుంజాబిక్షంకు ఎలాంటి మంత్రాలు, చేతబడులు రావని కక్షతోనే ఇదంతా చేశారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ప్రవీణ్, గంగయ్యను  అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి

Also read

Related posts

Share via