SGSTV NEWS
Crime

AP News: అయ్యో పాపం.. మనవళ్ల కోసం నాన్నమ్మ.. శవాలుగా తేలిన ముగ్గురు


అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పులివెందుల బ్రాంచ్ కెనాల్ లో బట్టలు ఉతకడానికి వెళ్లిన నానమ్మ ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. నీటిలో మునిపోయిన మనవళ్లను కాపాడడానికి వెళ్లి.. నానమ్మ నాగలక్ష్మీ కూడా మృతి చెందింది.

AP News: అయ్యో పాపం బట్టలు ఉతకడానికి వెళ్లి.. నానమ్మ,  ఇద్దరు మనవళ్ళు కాలువలో పడి చనిపోయారు. ఈ విషాదకర ఘటన  యల్లనూరు మండలం కల్లూరు గ్రామంలో జరిగింది. అయితే నాగలక్ష్మి అనే మహిళ తన మనవడు, మనవరాలితో కలిసి గ్రామ సమీపంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ లో బట్టలు ఉతకడానికి వెళ్ళింది.

మనవళ్ల కోసం
నాగలక్ష్మమ్మ బట్టలు ఉతుకుతుండగా మనవడు, మనవరాలు నీటిలో ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మనవరాలు లిడియా, మనవడు జాషువా డానియల్  ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని కాపాడేందుకు నీటిలోకి వెళ్లిన నాగలక్ష్మీ కూడా కాలువలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మరణంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Also read

Related posts