November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలు – సీఐడీ ఏడీజీ సంజయ్ సెలవు రద్దు

సీఐడీ చీఫ్ సంజయ్ సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. సీఐడీ చీఫ్ సంజయ్కు విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపైన విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అదే విధంగా విదేశాలకు పారిపోతున్నారంటూ విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంజయ్ మాత్రం తానే సెలవు రద్దు చేసుకున్నట్లు తెలిపారు. దీనితో ఈ నెల 6వ తేదీన వ్యక్తిగత పనుల పై అమెరికా వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని సంజయ్ వెనక్కు తీసుకున్నారు.

కాగా జగన్ పాలనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ముఖ్యనేతలు, ఇతరులపై తోచినట్లు తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు ఇలా పలు నిర్ణయాలతో అత్యంత వివాదాస్పద అధికారిగా సీఐడీ ఏడీజీ సంజయ్‌ నిలిచారు. అయితే తాజాగా ఆయన సెలవును సీఎస్ జవహర్ రెడ్డి ఆమోదించారు.

తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన సంజయ్, బుధవారం నుంచి నెల రోజుల పాటు సెలవు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ సెలవులను సంజయ్‌లానే వివాదాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌ జవహర్ రెడ్డి ఆయనకు నెల రోజులు సెలువు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకు వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాసుకున్నా, ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడంతో పాటు రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో విదేశాలకు పయనమవడం గమనార్హం.

దీంతో ఇంత కాలం సంజయ్‌ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు, ఆయన సెలువు పెట్టడంపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ట్రోల్‌ చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో భయపడి సెలువు పెట్టారంటూ మీమ్స్‌, ట్వీట్స్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారు. లోకేశ్‌ రెడ్‌ బుక్‌లో సంజయ్‌ పేరుందని, అందుకే ఆయన అస్సామ్‌ ట్రైన్ ఎక్కేస్తున్నారంటూ ట్రోల్స్‌ చేశారు. సంజయ్‌ను అరెస్టు చేసి విచారిస్తే జగన్‌ పాలనలో జరిగిన కుంభకోణాలు అన్నీ బయటకు వస్తాంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.

Also read

Related posts

Share via