SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. డౌట్ వచ్చి.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరేలా.!వైరల్ వీడియో


కడియం (తూర్పు గోదావరి) : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా … కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద కడియం సిఐ బి.తులసీదర్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తనిఖీ లో భాగం గా అందాలు వాహనాలను ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో బలెరో వాహనంలో తరలిస్తున్న విలువైన వెండి, బంగారపు వస్తువులు పట్టుబడినట్లు రాజమండ్రి సౌత్‌ జోన్‌ డిఎస్పి ఎం.అంబికా ప్రసాద్‌ వెల్లడించారు

. శుక్రవారం రాత్రి పలు శాఖల తనిఖీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనం పై సుమారు కోటి 40 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులను గుర్తించి ఆ సమాచారాన్ని జిల్లా ఎఫ్‌ఎస్టి, రిటర్నింగ్‌ అధికారులకు అందించామని తెలిపారు. దీనికి సంబంధించి జీఎస్టీ, ఇన్‌కంటాక్స్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తాసిల్దార్‌ బి.రమాదేవి సమక్షంలో పత్రాలను పరిశీలించారు. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి తరలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు డిఎస్పి వెల్లడించారు.

Also read

Related posts