SGSTV NEWS
CrimeTelangana

GIRL INJURED : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే…


హాస్టల్‌లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్‌ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్‌ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

GIRL INJURED : హాస్టల్‌లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్‌ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్‌ స్థానిక దవాఖానకు తరలిం

నాగర్ కర్నూల్ – అచ్చంపేటలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న నందినిపై ఇనుప పైపు పడి తలకు తీవ్రగాయమైంది. ఎస్సీ బాలికల హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడి ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక దవాఖానకు తరలించారు. నందిని అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఉండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. నందిని హాస్టల్‌ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. ఆమె తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్‌ స్థానిక దవాఖానకు తరలించారు. పరిసరాల్లో కోతుల బెడద అధికంగా ఉన్నదని, భవనంపై నుంచి వెళ్లే క్రమంలో పైపును కదలించడంతో ఊడిపోయి ఉండొచ్చని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో కాలకృత్యాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ముఖం కడుగుతుండగా భవనం పై నుంచి వాటర్ పైప్ ఉన్నట్టుండి తలపై ఊడిపడి బలమైన గాయం అయ్యిందని, తద్వారా పెద్ద ఎత్తున రక్తం కారిపోయిందని తెలిపింది. కాగా నందినిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి తలకు 15 కుట్లు వేశారు.

అయితే హాస్టల్‌ ఆవరణలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు తెలిపారు. కోతులు హాస్టల్‌ భవనం పై ఉన్న రాడ్‌ ను కదిలించడం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో వార్డెన్‌ అందుబాటులో  లేదని తెలిసింది. విద్యార్థినికి గాయం అయిందని తెలిసిన తర్వాత హాస్టల్‌కు చేరుకుని తర్వాత ఆస్పత్రికి తరలించింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు.

Also read

Related posts

Share this