April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి




బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలం నెల్లిపట్ల పంచాయతీకి చేరిన ఓటేరుపాలెంలో డెంగ్యూ జ్వరం సోకి బాలిక మృతి చెందిన సంఘటన మండలంలో శనివారం కలకలం రేపింది. బాలిక కుటుంబీకుల నుండి సేకరించిన వివరాల మేరకు … బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల సమీప గ్రామమైన ఓటేరుపాళ్యంలో గుణశేఖర్‌ కుమార్తె రక్షిత (12)కు పది రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందించారని తెలిపారు. వైద్యం చేయిస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా, డెంగ్యూ జ్వరం వచ్చినట్లు వైద్యులు తేల్చారని అన్నారు. బాలిక పరిస్థితి విషమించడంతో బైరెడ్డిపల్లి పీహెచ్సీ వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్‌ చేశారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు బాలిక మృతి చెందినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారని వివరించారు. విషయం తెలిసిన బైరెడ్డిపల్లి వైద్య సిబ్బంది వెంటనే మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మండలంలో వెంగంవారిపల్లి, ఓటేరుపాలెం, గ్రామాల్లో ఇప్పుడిప్పుడే డెంగ్యూ జ్వరాల లక్షణాలు కనబడుతున్నాయని ప్రజలు జాగ్రత్తలు పాటించి నివాసాల పరిసరాల్లో దోమలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ శానిటేషన్‌, పాగింగ్‌ తప్పనిసరిగా చేసుకోవాలని వైద్యులు సూచించారు. మఅతి చెందిన బాలిక బైరెడ్డిపల్లి మండలం కడప నత్తం హైస్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు

Also Read

Related posts

Share via