చింతపల్లి(అల్లూరి సీతారామరాజుజిల్లా)
మండలంలో తల్లిదండ్రులు ఇంటి పనులు చేయలేదని మందలించడంతో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామారావుపాలెం జరిగింది. అన్నవరం ఎస్ఐ వీరబాబు, కు టుంబీకులు అందించిన వివరాలిలా ఉ న్నాయి. లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో రామారావుపాలెం గ్రామానికి చెందిన బాలిక పాంగి దివ్య(13) వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది.
వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక అధిక సమయం చదవకుండా, ఏ పని చేయకుండా ఉండడంతో తండ్రి పాంగి బిట్టు, తల్లి కుమారి రెండురోజులు క్రితం మందలించారు. బుధవారం ఉదయం కూడా ఖాళీగా ఉండవద్దు ఇంటి పనులు, వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలని మందలించి తల్లిదండ్రు లు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు.
దీంతో మనస్థాపానికి గురైన బాలిక గ్రా మానికి సమీపంలో ఉన్న పంటపొలాల్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు ఉరి వేసుకున్న బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐ వీరబాబు తెలిపారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..