ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు. గెస్ట్ ఫ్యాకల్టీ, వాలంటీర్ టీచర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కృష్ణమూర్తి, నాయుడు, బోస్ అనే కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. కర్నూలు DEO, MEO సంతకాలతో..సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ ఇప్పిస్తున్నారు. జోహారాపురంలో పింకీ అనే ఓ మహిళకు సోషల్ టీచర్‌గా పోస్టింగ్ కూడా ఇప్పించారు.
స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పడంతో
స్కూల్ హెడ్ మాస్టర్ ఆమెను జాయినింగ్ చేసుకున్నారు.అనంతరం CFMS ఐడీ ఎప్పుడు వస్తుందని హెడ్ మాస్టర్ ను నిలదీసింది పింకీ. ఏజెన్సీ ద్వారా జాయిన్ అయిన వారికి..CFMS ఐడీ ఉండదని స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పడంతో షాక్ అయింది. రూ.5 లక్షలు ఇచ్చి మోసపోయానని తెలుసుకుంది. అటు తనను కూడా తప్పుదోవ పట్టించినట్టు తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది MEOలు, హెడ్మాస్టర్లు ఉన్నట్లు అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దందాకు తెరలేపారు కేటుగాళ్లు.
రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలిస్తున్న వాహనంపై దాడి చేసి భారీగా నోట్ల కట్టలు ఎత్తుకెళ్లిపోయిన దొంగలు ఈసారి ఏకంగా బ్యాంక్‌పైనే దాడి చేశారు. విజయపుర జిల్లా ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు తుపాకులు, ఇతర ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం, రూ.8 కోట్ల నగదును దోచుకొన్నారు. మంగళవారం సాయంత్రం దొంగలు బ్యాంకులోకి ఒక్కసారిగా చొరబడినట్లు ఉద్యోగులు తెలిపారిఉ. ఉద్యోగులను బంధించి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి పరారయ్యారు.
విజయపుర జిల్లా శివారు పట్టణం చడవణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లోని మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఏడు, ఎనిమిది మంది సభ్యులు కలిగిన ముఠా ఒకటి లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించింది. అక్కడి సిబ్బందిని గన్స్, కర్రలు, రాడ్స్‌తో బెదిరించారు. అంతేకాకుండా మేనేజర్, ఉద్యోగుల చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకు మూసివేసి ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





