ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మాడుగులలోని ఓ గిరిజన పాఠశాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి మిగతా ఇద్దరికోసం గాలిస్తున్నారు. టీచర్లే ఇదంతా చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు
Gang Rape: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల చేతిలో మరో బాలిక బలైంది. అల్లూరి జిల్లా మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. క్రిస్టమస్ పండుగ సందర్భంగా సెలవులపై ఇంటికెళ్లి హాస్టల్ కు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు చెప్పడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ నెల 25న కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులకు విషయం తెలియగానే 28 తేదిన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు 28న సాయంత్రం పాడేరులో బాధితురాలిని గుర్తించి స్టేషన్ తీసుకొచ్చారు.
మాయమాటలు చెప్పి నమ్మించి..
ఈ క్రమంలో ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జి.మాడుగుల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన కొర్రా మల్లీశ్వరరావు(22), వంతాల సన్యాసిరావు(24), మరో 16 ఏళ్ల అబ్బాయి తనకు మాయమాటలు చెప్పి పాడేరు తీసుకెళ్లినట్లు బాలిక చెప్పింది. అక్కడ ఆ ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన చెందింది. ఇక బాధితురాలిని పేరెంట్స్ కు అప్పగించిన పోలీసులు.. ఆ ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వంతాల సన్యాసిరావును అదుపులోకి తీసుకోగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ బి.శ్రీనివాస్ చెప్పారు. మరోవైప టీచర్ల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Also read
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!
- భార్య, బిడ్డను కడతేర్చిన భర్త
- అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికిరాడు..
- విద్యార్థినికి అధ్యాపకుడి లైంగిక వేధింపులు
మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన వైనం - Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..





