June 29, 2024
SGSTV NEWS
CrimeNational

Amroh Road Accident:  రోడ్ ప్రమాదం లో  నలుగురు యూట్యూబర్ల దుర్మరణం



ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో కూర్చున్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసనూర్ గజౌలా రోడ్డుపై చోటుచేసుకుంది. గాయపడివారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ యూట్యూబర్లు ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నారు. హసన్పూర్ గజౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. es కారులోని వారంతా అమ్రోహాలోని హసన్పూర్ విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షెహ్నవాజ్ పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.

Also read

Related posts

Share via