July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం… వీడియో


మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.


విజయవాడ:  కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల  14వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)లో చేరనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఆరంభంలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్‌సీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో  ఈ నిర్ణయంలో మార్పు జరిగింది. జనసేన నేతలు కూడ  ముద్రగడ పద్మనాభంతో టచ్ లోకి వెళ్లారు.

జనసేనలోకి వెళ్లేందుకు  ముద్రగడ పద్మనాభం సిద్దంగా ఉన్నారని కూడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ  ముద్రగడ పద్మనాభాన్ని కలిసి  పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడ ప్రచారం సాగింది. అయితే  పవన్ కళ్యాణ్  ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లలేదు.

టీడీపీ, జనసేనకు చెందిన  తొలి జాబితాను ప్రకటించిన తర్వాత  పవన్ కళ్యాణ్ కు  ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.  జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మరికొన్ని ఎక్కువ సీట్లు తీసుకొంటే బాగుంటుందని చెప్పారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం తన అసంతృప్తిని ఈ లేఖలో వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలతో  వైఎస్ఆర్‌సీపీ నేతలు  ముద్రగడ పద్మనాభంతో  మరోసారి టచ్ లోకి వెళ్లారు.  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి  ముద్రగడ పద్మనాభంతో ఫోన్ లో చర్చలు జరిపారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,  కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు కూడ  ముద్రగడ పద్మనాభంతో చర్చించారు.ఈ చర్చలతో  ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.భేషరతుగా వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.  వైఎస్ఆర్‌సీపీ తరపున ప్రచారం చేస్తానన్నారు.

Also read

Related posts

Share via