తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. పట్టణంలోని మూడంతస్తుల భవనంలో జవహర్ ఉంటున్నారు.గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు.
AP Crime : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. పట్టణంలోని మూడంతస్తుల భవనంలో జవహర్ ఉంటున్నారు.గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన జవహర్ పది రోజుల క్రితం గుడివాడ వెళ్లారు. మూడు రోజుల క్రితం ఆయన అర్ధాంగి ఉష, పిల్లలు స్వగ్రామమైన తిరువూరుకు వెళ్లారు. ఇంట్లొ ఎవరూ లేరని గమనించిన దుండగులు వెనుక డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని విలువైన వస్తువులను చోరీ చేశారు.
శనివారం నాడు ఇంట్లోని మొక్కలకు నీళ్లు పోసేందుకు జవహర్ అనుచరుడు వి.వి. రాజు ఇంటికి వచ్చాడు. ఇంటి వెనుకవైపు తలుపు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు, జవహర్‌కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం సిబ్బందితో ఆ ఇంటిని పరిశీలించారు. ఇంట్లో దొంగలు పడినట్లు సమాచారం తెలియడంతో జవహర్ అర్ధాంగి ఉష, కుమారుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ వెంటనే కొవ్వూరు చేరుకున్నారు. ప్రాథమికంగా రెండు సెల్ ఫోన్లు, ఖరీదైన వాచీలు, ఒక టీవీ, రూ.45 వేల నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి జవహర్ నివాసంలో వేలిముద్రలు సేకరించారు. జవహర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





