Hyderabad News: పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సైదాబాద్‌లో జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణలో దారుణం జరిగింది. పునారావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో బాలికల కోసం ఓ ప్రైవేట్ సంస్థ పునరావాస కేంద్రం నిర్వహిస్తోంది. జనగామ (Janagam) ప్రాంతానికి చెందిన బాలిక (14) మూడు నెలల నుంచి, మల్కాజిగిరికి చెందిన బాలిక (15) సెప్టెంబర్ 18 నుంచి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులున్నా వేర్వేరు కారణాలతో అక్కడ చేర్పించారు. అయితే, కేంద్రంలో బాలికల మధ్య స్నేహం కుదిరి అక్కడి నుంచి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 24న కిటికీ నుంచి దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సైదాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇద్దరు బాలికలు గత నెల 24వ తేదీన రాత్రి 8 గంటలకు జనగామ చేరుకున్నారు. బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపంలో ఉన్న పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయమున్న నాగరాజుకు ఫోన్ చేసింది. అతను వచ్చి ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బస్టాండ్ దగ్గరే ఒంటరిగా ఉన్న మరో బాలికను గమనించిన సాయిదీప్.. ఆశ్రయం కల్పిస్తానని పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిదీప్, బేకరీ నిర్వాహకుడు రాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను తీసుకెళ్లిన బాలికను నాగరాజు 25వ తేదీన ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ వద్దే వదిలేశాడు.
బాలికల విషయం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్‌లు హైదరాబాద్ తీసుకెళ్తామంటూ.. కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలిపెట్టారు. పోలీసులకు ఈ బాలికలు కనిపించడంతో అదే రోజు సైదాబాద్ తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. వారు భరోసా కేంద్ర నిపుణులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించగా.. బాలికలు తమపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..