ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ్ నగరంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు శివాని మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ప్రదీప్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. అయోధ్య జిల్లాలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహదత్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
పెళ్లాయ్యాక రాత్రి పడుకునేందుకు గదిలోకి వెళ్లిన నవదంపతులు ఇద్దరూ మరుసటి రోజూ ఎంతకు బయటకు రాలేదు. పదే పదే ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో డోర్ పగలుకొట్టి చూడగా ఇద్దరు చనిపోయి కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.
ఇద్దరి అంగీకారంతో పెళ్లి ఫిక్స్
ఈ ఘటనపై వరుడి అన్నయ్య దీపక్ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో అంతా సజావుగా జరిగిందని, ఆ జంట కుటుంబంతో కలిసి భోజనం కూడా చేశారని అన్నారు. అయితే రాత్రి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని వాపోయాడు. ఇద్దరి అంగీకారంతో ఆరు నెలల క్రితం పెళ్లి ఫిక్స్ చేశామని తెలిపాడు. అయితే ఈ సంఘటన ఆత్మహత్య కేసుగా కనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.
గదిలో విషపు సీసాగానీ, మరే ఇతర అనుమానాస్పద వస్తువుగానీ కనిపించలేదు. అయితే వధువు మెడపై గుర్తులు కనిపించాయి. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వారిద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- Lucky Zodiac Signs: మీన రాశిలో రవి, బుధుల కలయిక.. ఆ రాశుల వారికి అరుదైన యోగం..!
- Vastu Shastra for Money: ఈ దిశ కుబేర దిశ.. ఆర్దిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వాస్తు చిట్కాలు అనుసరించండి
- Hyderabad: విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండక్షరాల ప్రేమ
- అన్నం తినిపించే విషయంలో భార్యతో గొడవ! ఉరేసుకొని భర్త ఆత్మహత్య
- Telangana: శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై దొంగ కత్తితో దాడి.. రక్త మోడుతున్నా..దొంగను వదలని పోలీస్