February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

మదనపల్లె దస్త్రాల దహనం కేసులో
మొదటి అరెస్టు…

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో సీఐడీ ఎట్టకేలకు ఓ నిందితుడిని అరెస్టు చేసింది.

కడప-తిరుపతి :అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో సీఐడీ ఎట్టకేలకు ఓ నిందితుడిని అరెస్టు చేసింది. సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ప్రకటించారు. నిందితుడికి సహకరించిన, కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. గౌతమ్ తేజ్ ఈ కేసులో మొదటి ముద్దాయని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడిని చిత్తూరు 4వ అదనపు మున్సిఫ్ కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండు విధించారు. దీంతో చిత్తూరు సబ్  జైలు కు తరలించారు

ఈ ఏడాది జులై 21 తేదీ రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం జరిగింది. ఘటన జరిగిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెకు చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్ అంటూ ప్రకటించారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణాధికారిగా సీఐడీ డీఎస్పీ వేణుగోపాలు నియమించింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులు, అనుచరులు భారీగా భూ దందాలకు పాల్పడినట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియాకు అప్పట్లోనే బాధితులు పెద్దఎత్తున ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ శశిధర్… గనులశాఖను తన గుప్పిట్లో పెట్టుకుని దందాలు సాగించినట్లు తెలియజేశారు. వీటన్నింటిపై దృష్టిపెట్టిన సీఐడీ దస్త్రాల దహనం ఘటన వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు చేపట్టింది. పలువురు కీలక నిందితులను అదుపులోకి తీసుకోని సాక్ష్యాలను సేకరించింది

Also Read

Related posts

Share via