రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ కు చెందిన మోక్ష సాయిచరణ్ (19), నగరంలోని బల్కంపేటకు చెందిన యశ్వంత్ (20) మొయినాబాద్ లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం వీరితోపాటు చదివే స్నేహితుడి పుట్టినరోజు ఉండడంతో పది మంది కలిసి మొయినాబాద్‌లో బర్త్ డే పార్టీ చేశారు. అనంతరం మద్యం పార్టీ చేసుకోవడానికి బాటిళ్లు తీసుకుని పెద్దమంగళారం రోడ్డులోని పద్మావతి ఫంక్షన్‌హాల్ వెనుకవైపునకు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ వేసుకుంటూ వెళ్లడంతో విద్యార్థులు భయపడి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీశారు.
అక్కడ రైతు అడవి పందుల నుంచి కాపాడుకోవాలని వరిచేను చుట్టూ ఓ వైరుతో కంచె వేసి దానికి కరెంట్ షాక్ పెట్టాడు. ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాద స్థలాన్ని శనివారం ఉదయం చిలుకూరు సెక్షన్ విద్యుత్ ఏఈ శివరామకృష్ణ పరిశీలించారు.
Also read
- మేనబావతో పెళ్లి ఇష్టం లేక రైల్లోనుంచి దూకి యువతి
- పెళ్లయిన రెండు నెలలకే భర్త కువైట్ వెళ్లడంతో!
- Andhra News: ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
- పోలీస్ సైరన్ కు భయపడి పరుగులు తీసి..
- Andhra Pradesh: చుట్టాల్లా వస్తారు.. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..





