April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఏం కొడుకువురా..  ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపాడు!



ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.


ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు. దీంతో మూడు రోజులుగా ఇంటి ముందే డెడ్ బాడీని అంత్యక్రియలు జరగకుండా ఉంచారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం…  వెలికట్టె యాదగిరి (55)కి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు కొడుకు రమేశ్ ఉండగా రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి ఉన్నారు. అయితే రెండో భార్య పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా ఐదు ఎకరాలను రమేశ్ పేరున రిజిస్ట్రేషన్ చేసి, రెండు ఎకరాలను కట్నం కింద కూతురు శోభారాణి రాసి ఇచ్చాడు. 

మూడు రోజులుగా డెడ్ బాడీ ఇంటి ముందే
మరో మూడు ఎకరాలు అమ్మిబంగారం పెట్టారు. మిగతా ఐదు ఎకరాలను రెండో భార్య పద్మ పేరిట రాశారు. అయితే పద్మ తన పేరున ఉన్న భూమిలో మూడు ఎకరాలను అమ్మితన కూతురు శోభకు హైదరాబా ద్ ఇల్లు కొనిచ్చింది. ఇదిలా ఉండగా యాదగిరి అనారోగ్యంతో 2025 ఫిబ్రవరి 10వ తేదీన చనిపోయాడు. దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన రెండు ఎకరాల విషయం తేల్చిన తర్వాత తండ్రికి అంత్య క్రియలు చేసేది లేదని కొడుకు రమేశ్ పట్టుబట్టాడు. గ్రామస్తులు కూడా రమేశ్ కే మద్దతు పలకడంతో మూడు రోజులుగా యాదగిరి డెడ్ బాడీ ఇంటి ముందే ఉంది. చివరకు గ్రామస్తులు బుధవారం పద్మ, శోభతో మాట్లాడి వివాదాన్ని సెటిల్ చేశారు. దీంతో గురువారం యాదగిరి అంత్యక్రియలు జరపనున్నారు.

Also read


Related posts

Share via