భార్యపై అనుమానంతో భర్త మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన ఈవిషాదం పూణే చందన్ నగర్‌లో జరిగింది. విశాఖపట్నంకు చెందిన స్వరూప, మాధవ్‌లు మహారాష్ట్రలో ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో తాగిన మైకంలో మాధవ్ కొడుకుని గొంతుకోసి హత్య చేశాడు.
కట్టుకున్న భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకుని కడతేర్చాడు. ఈ ఘోరం మహారాష్ట్ర పూణేలోని చందన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కుటుంబం ఉద్యోగరీత్యా పూణేకు వెళ్లారు. మాధవ్ (38) టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. మార్చి 20 మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరిగింది. అనుమానంతో కోపంగా ఉన్న మాధవ్ కొడుకును తనతో తీసుకెళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గొడవ తర్వాత మాధవ్ బార్‌లో కూర్చుని మద్యం తాగాడు. ఈ తర్వాత అతను ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లి, అక్కడి నుంచి చందన్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అతనితోపాటే కొడుకుని కూడా తీసుకెళ్లాడు.
ఎంతసేపైనా భర్త ఫోన్ ఎత్తకపోవడంతో ఎక్కడున్నాడో తెలియక స్వరూప ఆయోమయానికి గురైంది. అదే రోజు అర్థరాత్రి ఆమె భర్త, కొడుకు కనిపించడం లేదని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా కీలకమైన వివరాలు బయటపడ్డాయి. మాధవ్ చివరిసారిగా గురువారం మధ్యాహ్నం 2గంటలకు తన కొడుకుతో కనిపించాడు. కానీ ఆ తర్వాత సాయంత్రం ఫుటేజ్‌లో అతను ఒంటరిగా ఉన్నాడు. మాధవ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతను ఓ లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ మాదవ్ ఒక్కడే తప్పతాగి పడి ఉన్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత, మాధవ్ తన కొడుకు హత్యను చేసినట్లు అంగీకరించాడు. అడవిలో మృతదేహాన్ని పడేశానని పోలీసులకు చెప్పాడు. మాధవ్ చెప్పిన ప్రదేశంలో గొంతు కోసి ఉన్న బాలుడి మృతదేహాన్ని సేకరించి పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. మర్డర్ కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఆఫీస్ తెలిపారు.
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!
Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు