నిజామాబాద్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు పడిన కుమార్తెను కాపాడబోయి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం కోటాల్‌పల్లి గ్రామంలోని గోరిగారి చెరువులో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి పెద్ద నర్సింలు (60), ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (40) చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రజిత ప్రమాదవశాత్తు చెరువులో జారిపడింది. గమనించిన తండ్రి ఆమెను కాపాడేందుకు వెంటనే నీటిలోకి దిగాడు.
అయితే, కుమార్తెను రక్షించే ప్రయత్నంలో నర్సింలు కూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, తండ్రి, కుమార్తె మృతదేహాలను వెలికితీశారు.
అనంతరం పోలీసులు మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోటాల్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!
- ఓటు వేసేందుకు వెళ్లిన మహిళకు చేదు అనుభవం.. బస్సులో 10 కాసుల బంగారం మాయం
- పగలే చోరీలు.. 130 పైన కేసులు.. కీ ప్యాడ్ ఫోన్ కూడా వాడడు.. ఘరానా దొంగ
- సెక్యూరిటీ గార్డు నుంచి కరోడ్పతిగా ఎదిగిన సామాన్యుడు.. తీగ లాగితే డొంక కదులుతోంది!
- ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలి టీచర్ మృతి!





