April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ – హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన


Andhra Pradesh News | వైద్యం వికటించి బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ ఘటన జరిగింది.

కర్నూలు:  ఎమ్మిగనూరులో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.



మంత్రాలయం మండలం కల్లూదేవాకుంట గ్రామానికి చెందిన సుజాత (28) గర్భం దాల్చినప్పటి నుండి ఎమ్మిగనూరులో ఉన్న ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా నిన్నటి రోజు పురిటినొప్పులు రావడంతో, ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి ఆమెకు సీజరిన్ చేసి బేబీ ను బయటకు తీశారు. తల్లి, బిడ్డ,క్షేమంగా ఉన్నారని, వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. కొంత సమయానికే సుజాతకు తీవ్ర రక్తస్రావం జరగడంతో వైద్యులు మరోసారి చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితికి వెళ్ళింది. వెంటనే అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించగా.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సుజాత మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఎమ్మిగనూరులో ఆమెకు డెలివరీ చేసిన ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ డెలివరీ కోసం వెళితే ఇలా మా అమ్మాయిని చంపడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.డెలివరీ సమయంలో సీజరిన్ చెసాగా రక్తస్రావం వస్తుందటంతో మరోసారి డాక్టర్లు ఆపరేషన్ చేయడంతోనే సుజాత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా వైద్య అధికారులు స్పందించి, ఆసుపత్రి పై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలనీ సుజాత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via