SGSTV NEWS online
CrimeTelangana

వివాహేతర సంబంధం.. పెట్రోల్ పోసి భర్తను చంపిన భార్య


మరికల్ కూడలి: తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది. డీఎస్పీ నల్లపు లింగయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. మరికల్ మండలంలోని మాద్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి రాములమ్మ, బాలస్వామి (16) దంపతులు. వీరికి 28 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలస్వామికి అదే గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కొన్నిరోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

భర్తలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన రాములమ్మ.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత నెల 24న అర్ధరాత్రి వ్యవసాయ పనుల కోసం ఇంట్లో ఉంచుకున్న పెట్రోల్ను.. నిద్రిస్తున్న అతడిపై పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలైన బాలస్వామిని మొదట మహబూబ్ నగర్ ఆసుపత్రికి, అటు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 25న మృతి చెందాడు. ఈ ఘటనపై రాములమ్మ నుంచి సేకరించిన వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే నేరం చేసినట్లు ఆమె అంగీకరించింది. దీంతో నిందితురాలి పై బీఎన్ఎ ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts