• హత్యకేసును ఛేదించిన పోలీసులు
భార్య, ప్రియుడి అరెస్ట్
బనశంకరి: పెడదారి పట్టిన ఓ మహిళ తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వైట్ఫీల్డ్ హగదూరులో ఈనెల 9న జరిగిన మహేశ్ (36) అనే వ్యక్తి హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. భార్య తేజస్విని, ప్రియుడు గజేంద్ర(35)ను అరెస్ట్ చేశారు. హాసన జిల్లా అరకలగూడు దొంబరపాళ్య నివాసి మహేష్తో తేజస్విని అనే మహిళకు కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. దంపతులు వైట్ఫీల్డ్ హగదూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
తేజస్విని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రుణాలు వసూలుచేసే విభాగంలో పనిచేసేది. గత ఏడాదినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తేజస్విని సహద్యోగి గజేంద్రతోవి వాహేతర సంబంధం పెట్టుకుందని మహేశ్ గుర్తించి మందలించాడు. గజేంద్రకు ఫోన్ చేసి హెచ్చరించాడు. కానీ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈనెల 9న తేజస్విని గజేంద్ర ఇంట్లో ఉండగా మహేశ్ గమనించాడు. భార్యపై దాడికి పాల్పడగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన గజేంద్రపై కూడా మహేశ్ దాడిచేశాడు.
ఈ సమయంలో తేజస్విని, గజేంద్రలు మహేశ్ గొంతు నులిమి హత్య చేశారు. హత్యను కప్పిపుచ్చేందుకు తేజస్విని నాటకం ఆడింది. తన భర్త ఉన్నఫళంగా కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులను నమ్మించింది. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వైట్ఫీల్డ్ పోలీసులు తేజస్వినిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా తప్పు ఒప్పుకుంది. భర్తను హత్యచేయడానికి ప్రియుడు గజేంద్ర సహకరించాడని తెలిపింది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేసి విచారణ చేపడుతున్నారు.
Also read
- స్మశానంలోకి ఆ రాత్రి తీసుకెళ్లి మరీ.. అలా చేశాడు.. రైడర్లూ పారా హుషార్..!
- Weekly Horoscope: ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..12 రాశుల వారికి వారఫలాలు
- తాడేపల్లిగూడెంలో ఇండియన్ ఆయిల్ సిబ్బంది దౌర్జన్యం
- సొంత అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు…
- మార్కండేయ మహాదేవ్: ఇక్కడ శివయ్యకు బిల్వ పత్రంతో పూజ చేస్తే సంతానం కలుగుతుందట,