నాగలుటి దేవాలయం:ఈ దేవాలయం వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ ఆలయంలో వీరభద్ర స్వామి కొలువై ఉంటారు. శ్రీశైలం నడిచే వెళ్లే భక్తులకు కాపలా ఉండేందుకు ఈ స్వామిని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వెంకటాపురం నుంచి శ్రీశైలం నడిచి వెళ్లే మార్గంలో భక్తులు తప్పిపోకుండా సరైన మార్గంలో శ్రీశైలం మల్లన్న దగ్గరికి ఈ స్వామి చేడుస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామికి కాపలా వీరభద్రుడు అని పేరు కూడా ఉంది.
ఎన్నో వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన ఈ వీరభద్ర ఆలయంలో అప్పటి రాజులు నిధులు దాచిపెట్టి ఉంటారని దురుద్దేశంతో గుప్తనిధుల వేటగాళ్లకు దాడిలో ఈ దేవాలయం అంతరించి పోతుంది. కనీసం ఇప్పటికీ ఒక వంద సార్లైనా గుప్తనిధుల కోసం ఈ దేవాలయంలో తవ్వకాలు జరిపిఉంటారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయం ప్రక్కన మండపంలో ఎంతో ప్రాచీనమైన పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ నంది కూడా ఈ గుప్త నిధుల వేటగాళ్ల దాటికి రెండు ముక్కలై పోయింది. మనిషికి ఎంత అత్యాస ఉందో చూడొచ్చు.
ప్రాచీన మన కళాసంపదను కాపాడాల్సింది పోయి, ఇలా గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల త్రవ్వి విగ్రహాలు బయటపడేసే స్థితికి వచ్చారు దుండగులు. ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు వారిని అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నా, మళ్ళీ కొత్త టీమ్‌లు పుట్టుకొచ్చి తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాల్లో కూడా కొత్తరకం పరికరాలు వినియోగిస్తున్నారు. భక్తితో దేవుని ఆరాధించాల్సింది పోయి లేని ధనం కోసం దేవుళ్లను అలయాలను ధ్వంసం చేస్తున్నారు కేటుగాళ్లు.
తాజాగా నాగలూటి దేవాలయంలో తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు దుండగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరార్ లో ఉన్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పరారైన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికైనా ఈ గుప్త నిధులు వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ప్రాచీన ఆలయాలను గుప్తనిధుల వేటగాళ్ల బారిన పడకుండా కాపాడాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..