జ్యోతినగర్(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది.
మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం… పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్లో నివసిస్తున్న నరేందర్ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు.
ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..