April 18, 2025
SGSTV NEWS
CrimeEntertainmentTelangana

Manchu Manoj : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్.. అలర్ట్ అయిన పోలీసులు..viral video




మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ వివాదం ఇప్పుడు మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరింది. తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బుధవారం ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


మంచువారింట మరోసారి పంచాయితీ హీట్ పెరిగింది. తండ్రితో మాట్లాడలంటూ జల్‌పల్లిలో నివాసం మోహన్‌ బాబు ఇంటి దగ్గరకు మనోజ్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మంగళవారం చోటు చేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా బుధవారం ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోహన్‌బాబు ఇంటికి 2 కిలో మీటర్ల నుంచి ఆంక్షలు విధించారు.




తన కూతురు పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు తన ఇంట్లోని కారు తీసుకెళ్లారని పోలీసులను ఆశ్రయించాడు మనోజ్. తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామాగ్రి ధ్వంసం చేశారని.. తమ కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని.. తన కారును దొంగించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని.. జల్ పల్లిలోని తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని అన్నారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవీరికి వెళ్లినప్పుడు దానిని మాదాపూర్ పంపించినట్లు మనోజ్ మీడియాతో వెల్లడించారు.

Also Read

Related posts

Share via