SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimeLok Sabha 2024

కట్టలు కాదు.. నోట్ల గుట్టలు.. తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది.. దేశంలోనే సంచలనం..

గుట్టలు కాదు.. నోట్ల కట్టలు.. అంతా బ్లాక్ మనీనే.. జార్ఖండ్‌ మనీలాండరింగ్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.. జార్ఖండ్‌ మంత్రి ఆలంగిర్‌ కార్యదర్శి సంజీవ్‌ పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే.. మంత్రి ఆలంగీర్‌ సెక్రటరీ ఇంట్లో తీగ లాగితే.. పనిమనిషి ఇంట్లో డొంక కదిలింది.. అక్షరాలా 35.23 కోట్లు పట్టుబడ్డాయి. రెండు రోజుల పాటు లెక్కేసిన అధికారులు మొత్తం క్యాష్‌ను సీజ్‌ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇదంతా బ్లాక్‌మనీనే. జార్ఖండ్‌ రాజధాని రాంచీ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది.

ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు. భారీగా సిబ్బందిని మోహరించి.. పకడ్బంధీగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ (పనిమనిషి) ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. దీంతో అతనితోపాటు సంజీవ్‌లాల్‌ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

కాగా.. గత కొన్ని రోజుల నుంచి జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మనీలాండరింగ్ కేసు అందరి మెడకు చుట్టుకుంటోంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే (ఫిబ్రవరిలో) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ విచారణ కొనసాగుతుండగానే.. మంత్రి ఆలంగీర్ సెక్రటరీ అరెస్టవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇద్దరి విచారణ తర్వాత కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ను కూడా ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రికవరీ రూ.35.23 కోట్లుగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఘటనపై ఆలం స్పందిస్తూ.. తాను ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.

Also read

Related posts