Eluru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ
మధ్యకాలంలో ర్యాగింగ్ భూతం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనిబారిన పడిన విద్యార్థులు చివరకు ఫైటింగ్కు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరు మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది?
ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లో మూడో ఇయర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అంతేకాదు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొన్నాళ్లుగా ఈ ఘటన జరుగుతున్నా, విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనం వ్యవహరించారు.
అయితే రోజురోజుకూ సీనియర్ల ఆగడాలు శృతి మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్కు దారి తీసింది. చివరకు 15 మంది సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్కు చేరుకుని విచారణ చేపట్టారు.
అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
సీనియర్లు చెప్పిన పనులు చేయకుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలం మంగళగిరి ఎయిమ్స్ ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో పలువురు విద్యార్థులను ఇంటికి పంపారు. ఇప్పుడు ఏలూరు వంతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





