నెల్లూరు: ‘ఆస్తి కోసం నా చిన్న కుమారుడు చిత్రహింసలుపెడుతున్నాడు. నేను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తి కాజేయాలని యత్నిస్తున్నాడు. విచారించి చర్యలు చేపట్టాలి’ అని పొదలకూరుకు చెందిన ఓ వృద్ధురాలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 71 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డిలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు.
తన తల్లి ఆత్మహత్య ఘటనలో లోతుగా విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నవాబుపేటకు చెందిన ఓ వ్యక్తి కోరారు.
→ అత్తింటి వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఏఎస్పేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..