July 3, 2024
SGSTV NEWS
National

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. ఈడీ కార్యాలయానికి తరలింపు!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళింది



ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళింది. మరోవైపు, ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రభస సృష్టిస్తున్నారు.  మరోవైపు ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుపోయారు. ఈ విషయం ముందస్తు బెయిట్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి విముక్తి లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ED బృందం సిఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు 9 సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే!

Also read

Related posts

Share via