October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

వేప అంకమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు.


– నేడు శ్రీ లలితా త్రిపుర సుందరిగ అంకమ్మతల్లి దర్శనం

ఒంగోలు::

దసరా పండుగను పురస్కరించుకొని నగరంలోని దేవాలయాలని ఆధ్యాత్మిక శోభతో అలరిస్తున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలంకరణలో శోభాయమానంగా ఆధ్యాత్మిక దీప్తిని దిగుణకృతం చేస్తున్నాయి.

స్థానిక సీతారాంపురం లోని వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా శనివారం వేప అంకమ్మ తల్లి అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పసుపులేటి సరస్వతి, కుమారుడు హనుమంతు రావుల మాట్లాడుతూ వేప అంకమ్మ తల్లి ఆశీస్సులతో సీతారాంపురంలో ఆలయాన్ని నిర్మించి పండుగలు అన్నిటిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామని, ఆలయ నిర్మాణంతో పరిసరాలలో ఆధ్యాత్మిక భావనలను పెంచి పరిసర హిందూ సమాజంలో దైవిక శక్తులను ఉద్దీపన చెందడం జరుగుతుందని తెలిపారు. ఆలయ పురోహితులు చిల్లర పవన్ కుమార్ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఆదివారం లలితా త్రిపుర సుందరిగా భక్తులను అనుగ్రహిస్తారని, కావున ఒంగోలు నగర పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందాలని కోరారు.

Also read

Related posts

Share via