SGSTV NEWS online
CrimeTelangana

నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..



ఖమ్మం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు….  తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్ ఉన్నావు.. బొద్దుగా కనిపిస్తున్నావు..’ అంటూ ఓ వివాహితతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. చేయి విరిగిన ఆమె సర్జరీ కోసం రాగా.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో హహిళ భయబ్రాంతులకు గురికాగా.. ఘటనపై వివాహిత బంధువులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

వైరా నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో పనులు చేస్తుండగా కిందపడటంతో చేయికి తీవ్రంగా గాయమైంది. సమీపంలోని ఆర్ఎంపీని సంప్రదిస్తే చేయి విరిగిందని నిర్ధారించి ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ సమీపాన శివ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ పరీక్షించాక సర్జరీ చేయాలని చెప్పడంతో గత గురువారం ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం సర్జరీ చేసేందుకు నిర్ణయించగా, ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లాక సదరు మహిళపై సిబ్బంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆపై ఆపరేషన్ చేయడానికి వైద్యుడు కూడా అదే మాదిరి ప్రవర్తించాడు. కేస్ట్లో వివరాలన్నీ ఉన్నా వయస్సు ఎంత అని అడిగి చెప్పగానే అంత వయస్సులా కనిపించడం లేదు… అందంగా ఉన్నావు… తెల్లగా, వయస్సు తక్కువగా కనిపిస్తున్నావు… అంటూ మాట్లాడడంతో ఆమె భయాందోళనకు గురైంది.

ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక కుటుంబీకులకు చెప్పడంతో డాక్టర్, సిబ్బందిని నిలదీస్తే అలాంటిదేమీ బుకాయించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్నా ఇష్టపడని మహిళను డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లాపోయారు. కాగా, ఘటనపై ఆస్పత్రి యాజమాన్యానికి వివాహిత కుటంబీకులు ఫిర్యాదు చేయగా, ఆమె ఆరోగ్యం చక్కబడ్డాక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Also read

Related posts