SGSTV NEWS online
CrimeNational

సెల్ఫోన్ చూడొద్దంటావా?భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచిన భార్య 



కర్ణాటక: మొబైల్ ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పిన భర్తపై భార్య  కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్ నిత్యం సెల్ఫోన్ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది.

ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

చోరీ సొత్తు అప్పగింత

రాయచూరు రూరల్: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్ నుంచి తీన్కందిల్ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐ నరమమ్మ పాల్గొన్నారు

Also read

Related posts