SGSTV NEWS
CrimeTelangana

Crime news: ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం



ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ గర్ లో జరిగింది.

హుజూర్నగర్ : ప్రేమిచడం లేదని యువతిపై  పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన ఓ యువతి పట్టణంలోని ఆమె మేనమామ ఇంట్లో ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ యువతితో పరిచయం ఉన్న ఆమె స్వగ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చింది. కోదాడ రోడ్డులో ఉన్న ఓ దుకాణం ఎదుట మాట్లాడుతుండగా తనను ఎందుకు ప్రేమించడం లేదని యువతితో గొడవపడిన ప్రమోద్ కుమార్ పెట్రోల్ పోశాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు పట్టించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Also read

Related posts

Share this