కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 16 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు ఈవీఎం గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాం తాళాలను తీయించారు.గోదాంలో ఉన్న చెడిపోయిన ఈవీఎంలను పరిశీలించారు.

ఈవిఎంలకు సంబంధించిన రిజిస్టర్లను చూశారు.ఈవీఎంలను ఈసీఎల్,బెంగళూరు,బెంక్,బిహెచ్ఎల్ కంపెనీలకు పంపుతామని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవోలు రఘునాథరావు,ప్రభాకర్,ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్,అనిల్ కుమార్,ప్రియదర్శిని,రాజకీయ పార్టీల ప్రతినిధులు నిరంజన్,కాసిం,తదితరులు పాల్గొన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..