ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించిన షర్మిల, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు దిక్కులేదు
మెడికల్ కాలేజి అన్నారు పెట్టలేదు –
ఇంజనీరింగ్ కాలేజి అన్నారు కట్టలేదు ఇది గిరిజనులపై జగన్ కి ఉన్న ప్రేమ అని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.
అరకు ప్రాంతంలో యదేచ్ఛగా మైనింగ్ మాఫియా జరుగుతుందని, గుట్టలు గుట్టలు అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, 10 ఏళ్లు రాష్ట్రాన్ని బాబు, జగన్ కలిసి సర్వనాశనం చేశారని షర్మిల మండిపడ్డారు.
అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్ల వెనక్కు వెళ్ళిపోయిందని షర్మిల ఆరోపించారు.
కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. అధికారంలో రాగానే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2.25లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ల ను 4 వేలు..వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇస్తామని, రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇళ్లు లేని పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష ఆర్థిక సహాయం అందించే దిశగా కృషి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు
Also read .
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





