SGSTV NEWS
Andhra PradeshLatest News

బుడమేరు గండ్ల మట్టిని మెరకకు అక్రమంగా తరలించారా ? : మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ బుడమేరుకి పడిన మూడు గండ్లు వలన విజయవాడలో అనేక పరీవాక ప్రాంతాల్లో జలమయమయ్యి కకావికలం చేసిన వైపరీత్యాన్ని అరికట్టగలిగామని నీటి పారుదల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం చెప్పారు. గత ఐదు రోజులుగా సింగ్‌ నగర్‌ ఇతర ప్రాంతాల్లో నీళ్లలో నానుతున్న ప్రజల బాధలను వెంటనే నివారించేందుకు మీనమేషాలు చూడకుండా పూడిక పనుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే పూడిక పనులు గత ఐదు రోజులుగా రేయింబవళ్ళు చేస్తున్నట్లు రామానాయుడు చెప్పారు. పనుల్లో ఒక్క క్షణం కూడా కనీసం ట్రక్‌ డైవర్లకు వ్యవధి ఇవ్వకుండా రేయింబవళ్ళు తాను ఇక్కడే వుండి ఈ గండ్లను పూడ్చామని, 40మంది ఇంజనీరింగ్‌ మిలిటరీ అధికారులు కూడా తగిన సూచనలు ఇచ్చారని అయన తెలిపారు. కొండపల్లి శాంతినగర్‌ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర 15 అడుగుల వెడల్పు 15 నుండి 20 అడుగుల లోటున గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్‌ తదితర ప్రాంతాల మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధఅతి తగ్గడంతో ఇరిగేషన్‌ అధికారులు గండ్లను పూడుస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని మంత్రులు లోకేష్‌, రామానాయుడుకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు పదిహేను వందల ట్రిప్పుల బండరాళ్లు, మట్టి కంకర తరలించారు. రోడ్డు ఏర్పాటుకు, రెండు గండ్ల ఏర్పాటుకు దాదాపు 50వేల టన్నుల మెటీరియల్‌ను వినియోగించారు. గండ్ల పూడ్చివేతను మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా దగ్గరుండి పర్యవేక్షించ్చారు.. ఇవాళ మడ్యాష్ణం వరకు మూడో గండిని కూడా పూడ్చటం పూర్తీ అయ్యింది.
కాగా అసలు దశాబ్దం నుండి బుడమేరుకు చెప్పుకోదగ్గ స్థాయిలో వరదలు లేనందున ఇంత భారీ గండ్లు పడే అవకాశం లేదని, గడచిన అయిదేళ్ళల్లో బుడమేరు భారీగా అక్రమణలకు గురి అయిందని, ఈ భాగంలో ఇళ్ల నిర్మాణంలో స్వార్ధపరులు నిర్మించిన భారీ నిర్మాణాలకు ఆ గండ్లు గా పేర్కొంటున్న చోట మట్టిని తొలగించి తవ్విన విషయంలో కొందరు ఉన్నారన్న దిశగా దర్యాప్తు జరిపించాలిసి వుంది.గతంలోనే రాజధాని అమరావతిలోనే రోడ్లను కూడా తవ్వేసిన తరలించుకుపోయిన విషయం తెలిసిందే. అందుకే ఈ విషయం తెలిసే జగన్మోహన్‌ రెడ్డి మాన్‌ మేడ్‌ ప్రమాదంగా బుడమేరు వరదను నిజాన్ని కక్కేసారా? అనే అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఏమైన ఈ దారుణ ముంపుకు లక్షలాది మంది ప్రజలు గురై పడరాని పాట్లకు కారణమైన విషయంలో దర్యాప్తు జరిపించాలని పలువురు కోరుతున్నారు

తాజా వార్తలు చదవండి

Related posts

Share this