ధర్మస్థల క్షేత్రంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ధర్మస్థల పుణ్యక్షేత్రంలో మృతదేహాలు పాతిపెట్టినట్లు పారిశుద్ధ్య కార్మికుడుతో పాటు మరో ఆరుగురు సాక్ష్యులు ముందుకు వచ్చారు. ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా సెలెంట్‌గా ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల పుణ్య క్షేత్రంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన చేతులతో వందల మంది అమ్మాయిలను పూడ్చిపెట్టినట్లు ఎస్పీకి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో తవ్వకాలు చేపట్టింది. అయితే కేవలం ఈ పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే కాదు.. మరో ఆరుగురు వ్యక్తులు మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ముందుకు వచ్చారు. ఫిర్యాదుదారుడు చేసిన ప్రకారం సిట్ అధికారులు ఇప్పటి వరకు 13 చోట్ల తవ్వకాలు జరిపారు. ఇందులో పాయింట్ నంబర్ 6 వద్ద అస్థిపంజరం, ఎముకలు వంటివి లభ్యమయ్యాయి.
ఇప్పుడు మరో ఆరుగురు రావడంతో ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ ఆరుగురు కూడా మృతదేహాలను ఖననం చేసిన ప్లేస్‌లో తవ్వకాలు చేపడితే ఆధారాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సిట్ 13 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో ఆస్థిపంజరాల ఆనవాళ్లు, వస్తువులు లభ్యమయ్యాయి. 13 స్పాట్లు మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నేత్రావతి నది పరిసర ప్రాంతాలు అన్ని కూడా 15 ఏళ్లలో పూర్తిగా మారిపోయాయి. దీంతో అనుమానం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టారు.
కేసు ఎవరు పెట్టారంటే?
ఈ ప్రాంతంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు మహిళలను ఈ ప్రదేశంలో ఖననం చేసినట్లు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 1995 నుంచి 2014 సమయంలో ఇలా ఎందరో మహిళలను రహస్యంగా పూడ్చిపెట్టినట్లు లేఖలో తెలిపాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది.
ఈ కేసుతో అనుమానాలు
ఓ వైద్య విద్యార్థిని కొన్నేళ్ల కిందట ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని తెలిపింది. అయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పుణ్య క్షేత్రంలో ఎన్నో వందల మహిళలు, విద్యార్థినులు అదృశ్యమయ్యారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయిలు ఇక్కడికి వెళ్లాలంటే భయపడుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఇలా ఎందరో అమ్మాయిల ఆశలన్నీ ఇక్కడే గాల్లో కలిసిపోయాయని తెలుస్తోంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025