సెల్ ఫోన్ ఎంత మంది జీవితాల్లో చిచ్చు రాజేస్తుందో అనేక సంఘటనలు చూశాం. ఈ పరికరం.. మనిషి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. కానీ కొంత మంది అదే జీవితంగా బతికేస్తున్నారు. చివరకు..
తరం మారుతున్న కొద్దీ.. కొత్త పరికరాలు పుట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా వినోదాన్ని పంచడానికి రేడియో, టీవీ, సెల్ ఫోన్స్ వంటివి వచ్చాయి. కానీ టీవీ కన్నా సెల్ ఫోనుకు బాగా కనెక్ట్ అయ్యారు పీపుల్. చిన్న పిల్లవాడి నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. పిల్లలకు భోజనం పెట్టాలన్న చరవాణి చూపించాల్సిందే. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నెట్ లేదా చార్జింగ్ అయిపోవాలి తప్ప.. ఫోన్ వదిలి పెట్టడం లేదు. సమయం, సందర్భం లేకుండా నెట్టింట్లో ఈత కొడుతున్నారు. దీని వల్ల యువత పక్కదోవ పడుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఫోనుకు అడిక్ట్ అయిపోయి పుస్తకాలను పక్కన పెడుతున్నారు. తల్లిదండ్రులు తిడుతుంటే వారిపై రివర్స్ అయిపోతున్నారు. లేకుంటే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చదువుకోకుండా అస్తమాను సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటుందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన కూతురు.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. తిప్పకొండనహళ్లి గ్రామానికి చెందిన నారాయణ్, సుధ భార్యా భర్తలు. వీరికి లిఖిత అనే కుమార్తె ఉంది. చదువుకోకుండా ఆమె సెల్ ఫోన్ చూస్తూ ఉండేది. అస్తమాను ఫోన్ చూస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. వయస్సులో ఉన్న పిల్ల కావడంతో కాస్త ఆందోళన చెందారు. ఫోను విషయమైన ఆమెకు చీవాట్లు పెట్టారు. పుస్తకాలు తీసి చదవాలని సూచించారు. పదే పదే పేరెంట్స్ కోప్పడటంతో మనస్థాపానికి గురైంది కూతురు లిఖిత. తల్లిదండ్రులు తిట్టగానే.. కోపంతో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. లిఖిత ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో నారాయణ్, సుధలకు అనుమానం పెరిగింది.
తలుపులు తట్టినా, అరిచినా ఆమె తీయలేదు. దీంతో తలుపులు కొట్టి చూడగా.. ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది లిఖిత. కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఖిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా.. సెల్ ఫోన్ చూడొద్దు అన్నందుకే కూతురు బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. కనీసం మందలిస్తే.. పుస్తకాలు తీస్తుందని భావించారు పేరెంట్స్. కానీ వారిని శోక సంద్రంలో ముంచేసి, కడుపుతీపి మిగిల్చింది కూతురు. పెళ్లీడుకొచ్చిన కూతుర్ని తమ చేతులతో తామే చంపుకున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇటీవల కాలంలో పిల్లల్ని చిన్న విషయంపై కసురుకున్న, కోప్పడిన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేరెంట్స్ కు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు.
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!