April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!


సూర్యాపేట జిల్లా మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణను బండ రాళ్లతో కొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి



Suryapet Incident:  సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే  కెనాల్ కట్టపై పై కృష్ణ మృతదేహం లభ్యమైంది. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరువు హత్య..
కృష్ణ ఆరునెలల క్రితం కృష్ణ భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి  కులాంతర  వివాహం చేసుకున్నాడు. అయితే చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో భార్గవి సోదరుడు కృష్ణ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మరోవైపు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ హఠాత్తుగా హత్యకు గురికావడం మరో అనుమానానికి తెరలేపింది. దీంతో కృష్ణది పరువు హత్యనా? లేదా పాత కక్షలే కారణమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read

Related posts

Share via