SGSTV NEWS
CrimeNational

మృత్యుపాశమైన విద్యుత్ తీగలు



పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు.



బల్లార్ష, : పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు. కొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరాల్సిన నలుగురిని విద్యుత్ తీగలు మృత్యుపాశాలై కబళించాయి. మహారాష్ట్రలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రపుర్ జిల్లా బ్రహ్మపురి తాలూకా గణేశ్పుర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ రవూత్(65), యువరాజ్ డొంగరే(43), నానాజీ రవూత్(55), చిచ్కీడా గ్రామానికి చెందిన పుండలీక్ మాన్కర్(65) కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం ఉదయం గణేశ పుర్ శివారులోని ఓ రైతు పొలంలో వరినాట్లు వేసిన ఆ కూలీలు పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. పొలం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు లైన్ తీగలు అదే సమయంలో ప్రమాదవశాత్తు తెగి కిందపడిపోయాయి. ఆ తీగలు తగలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.

Also read

Related posts

Share this