కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన

ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో… వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్