నీళ్లతోటి నీ కొచ్చే కష్టాలను చూడు చెల్లెల్లో .. చంద్రమ్మ అని ఓ జానపద గేయం ఉంది. వేసవి కాలంలో ఈ వాటర్ కష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే విషయం ఓ కుటుంబంలో చిచ్చు రాజేసింది.
సమ్మర్ వచ్చిందంటే చాలు నీటి కష్టాలు మొదలౌతాయి. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరుతో సహా పలు నగరాలు వాటర్ లేక కటకటలాడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగు అంటుకుపోవడంతో తాగు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుళాయిలు కూడా రెగ్యులర్‌గా వచ్చేవి. వేసవి కాలం కావడంతో కొన్ని చోట్ల రోజు విడిచి రోజు వస్తున్నాయి. ఒకప్పుడు వీధి వీధి అంతా చేరి.. కుళ్లాయి దగ్గర బిందెలతో కొట్టుకున్న గొడవలు చూశాం. కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారికి వాటర్ టాప్ వచ్చేసింది. అయినప్పటికీ నీటి విషయంలో గొడవలు తగ్గలేదు. ఇంటి ఓనర్, అద్దెకు ఉండే వాళ్ల మధ్య.. లేదా మోటర్ వేయడం వల్ల మాకు సరిగా నీరు అందడం లేదంటూ పొరిగింటితో తగాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఓ గొడవే.. కోడలి మరణానికి కారణమైంది.
అత్తా, కోడళ్ల మధ్య చిన్న విషయాలకు కూడా తగాదాలు జరుగుతుంటాయి. ఈ రియల్ టామ్ అండ్ జెర్రీస్ ఉన్న ప్రతి ఇంట్లోనూ గొడవలు కామన్. కానీ నీళ్ల వల్ల అత్తా, కోడలికి మధ్య గొడవలు వచ్చి.. చివరకు కోడలు చనిపోయిన దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణానికి పెద్దాకుల వీధిలో రఘునాథ్, మాలతీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. కొడుకులకు పెళ్లి చేసి.. వారితోనే జీవిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోరులో అత్తామామలు, ఫస్ట్ ఫ్లోరులో చిన్న కుమారుడు, పెద్ద ఫ్లోరులో పెద్ద కుమారుడు జీవిస్తున్నారు. పెద్ద, చిన్న కోడలు శ్రీదేవి, సుష్మలు బ్యూటీ ఫార్లర్ రన్ చేస్తూ ఉంటుంది. అయితే శ్రీదేవి, అత్తకు మధ్య పొసగదు. నిత్యం అత్తతో ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది.
శనివారం కూడా నీళ్ల విషయంపై శ్రీదేవితో అత్తమ్మ మాలతికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంతో తోటి కోడలితో పోల్చి చూస్తే…చిన్న కోడలే నయం అంటూ హేళన చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీదేవి.. ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. అయితే కోపంతో ఇంట్లో కూర్చుని ఏడుస్తుందని అనుకున్నారు తప్ప.. ఇంత నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు. శ్రీదేవి ఎంత సేపటికి గది నుండి బయటకు రాకపోవడంతో.. తలుపులు తట్టి చూడగా..ఫ్యానుకు వేలాడుతు కనిపించింది. కానీ చివరకు క్షణికావేశంలో ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదంటూ అత్త కంటతడి పెట్టింది. కానీ ఇరుగు పొరుగు మాత్రం.. మీ సూటి పోటీ మాటల వల్లే చనిపోయిందంటూ నిందించడం మొదలు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి అత్తను అదుపులోకి తీసుకున్నారు. శ్రీదేవి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఇద్దరు పిల్లల్ని తల్లి లేకుండా చేసినట్లయ్యింది.
Also read
- పరారీలో అఘోరి, శ్రీ వర్షిణి.. ఫోన్లు స్విచ్చాఫ్- ఆ భయంతోనే జంప్!
- విహారయాత్రలో విషాదం – విద్యార్ధి మృతి
- Wife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!
- Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !
- Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!