నెల్లూరు జిల్లా: కావలిలో దాష్టికం చోటు చేసుకుంది. పాఠశాల ముందు తినుబండారాలు అమ్మే ఒక చిరు వ్యాపారి, చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తూ నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
తినుబండారాల ఆశ చూపి బాలికలను తన వలలోకి దింపిన ఈ వ్యక్తి, పాఠశాల పరిసరాల్లోనే దుష్కార్యాలకు పాల్పడినట్లు సమాచారం. బాధిత బాలికలు భయంతో మౌనం పాటించగా, చివరికి పాఠశాల హెడ్మాస్టర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే, మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం స్థానికులలో ఆగ్రహాన్ని రేపింది.
ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు రంగంలోకి దిగారు. వారు బాధిత బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, అధికారికంగా ఫిర్యాదు చేయించేలా ముందడుగు వేశారు. దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ఈ కేసును కేవలం సాధారణ నేరంగా కాకుండా పోక్సో చట్టం కింద నమోదు చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగడం సమాజానికి మచ్చ అని వారు పేర్కొంటూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.
Also read
- షాపింగ్ మాల్లో సీక్రెట్ ప్లాన్ ఫెయిల్… జీడిపప్పు కేసులో మహిళల అరెస్ట్
- డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య
- నెల్లూరు జిల్లాలో దాష్టీకం
- లాడ్జిలో అగ్ని ప్రమాదం.. ఒకరి సజీవదహనం
- చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం






టీడీపీలోకి చేరిన కోడికత్తి శీను – జగన్ సీఎం కావడం కోసం ఐదేళ్లు జైళ్లో మగ్గానని ఆవేదన – Kodi Kathi Seenu Joined Tdp