అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప తోట వర్షాలకు దెబ్బతినడంతో మనస్తాపం చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కురవి, : అప్పులు తెచ్చి సాగు చేసిన మిరప తోట వర్షాలకు దెబ్బతినడంతో మనస్తాపం చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కురవి ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం హరిదాస్ తండా గ్రామ పంచాయతీ శివారు హర్యాతండాలో భూక్య హతీరాం(33) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టారు. దానికితోడు పాత అప్పు రూ.4 లక్షలు ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిరప పంట తుడిచిపెట్టుకుపోయింది. అప్పులు ఎలా తీర్చాలన్న ఆందోళనతో గురువారం పురుగు మందు తాగారు. వెంటనే కుటుంబసభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.
తాజా వార్తలు చదవండి
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!